మద్యం మత్తులో దాడి.. ఇద్దరికి గాయాలు
W.G: మొగల్తూరు వైన్ షాపులో సోమవారం జరిగిన ఘర్షణలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వైన్ షాప్ వద్ద మద్యం మత్తులో మోటూరి కిరణ్ అనే వ్యక్తి బీరు సీసాను పగులగొట్టి అక్కడే ఉన్న విల్లూరి కుమార్ బాబు, విల్లూరి సుగుణారావుపై తీవ్రంగా దాడి చేశాడు. స్థానికులు బాధితులను వెంటనే నరసాపురం ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్సై కె.నాగేశ్వరరావు కేసు నమోదు చేశారు.