డోన్–సికింద్రాబాద్ రైల్వే సెక్షన్ తనిఖీ

డోన్–సికింద్రాబాద్ రైల్వే సెక్షన్ తనిఖీ

కర్నూలు: దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ఇవాళ డోన్-సికింద్రాబాద్ రైల్వే సెక్షన్‌ను సమగ్రంగా తనిఖీ చేశారు.హైదరాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ సంతోష్ కుమార్ వర్మతో పాటు సీనియర్ అధికారులు తనిఖీలో పాల్గొన్నారు. డోన్ నుంచి సికింద్రాబాద్ వరకు రియర్ విండో తనిఖీ నిర్వహించిన జనరల్ మేనేజర్, మార్గమధ్యంలోని ప్రధాన స్టేషన్లను పరిశీలించారు.