స్కూల్ అసిస్టెంట్ పోస్టులను పెంచాలంటూ నిరసన

స్కూల్ అసిస్టెంట్ పోస్టులను పెంచాలంటూ నిరసన

సూర్యాపేట: జిల్లా కేంద్రంలోని గ్రంథాలయం ఎదుట డీఎస్సీ నోటిఫికేషన్‌లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులను పెంచాలని సోమవారం నిరుద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో 11,062 పోస్టులలో అధిక మొత్తంలో సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు ఉన్నాయని, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మాత్రం కేవలం 2,629 ఉండడం చాలా బాధాకరమన్నారు.