పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం

పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం

BHNG: తుర్కపల్లి మండలం ములకలపల్లి గ్రామంలోని పారిశుద్ధ్య కార్మికులను ఎంపీడీవో లెంకల గీతారెడ్డి సన్మానించారు. గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు నిర్వహించినందుకు వారిని సన్మానించినట్టు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో వెంకటేశ్వర్లు, డిప్యూటీ తహసీల్దార్ కల్పన, పంచాయతీ కార్యదర్శి కూరేళ్ల నాగరాజు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.