గాదెగుమ్మి జలపాతం పరవళ్లు..

ASR: ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు కొయ్యూరు మండలంలోని గాదెగుమ్మి జలపాతం పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. పర్యాటకంగా ఎంతో ప్రఖ్యాతి గాంచిన ఈ జలపాతం అందాలను చూసేందుకు ఇతర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు తరలివస్తారు. అయితే ప్రస్తుతం భారీ వర్షాలకు జలపాతం ఉగ్రరూపం దాల్చింది. దీంతో పోలీసు, రెవెన్యూ అధికారులు జలపాతం వద్దకు ఎవరూ రావద్దని సూచించారు.