అటువైపు వెళ్తున్నారా? జాగ్రత్తా!

BHPL: కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షాల కారణంగా నదుల్లో నీటిమట్టం 12.220 మీటర్లకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి 9,02,550 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా, 85 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.