పాలకమండలి లేకపోవడం వల్లే ‘విలీనం’ ఈజీ
HYD: గ్రేటర్‌లో కలువనున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రస్తుతం ఎటువంటి పాలక మండలి లేదు. సంవత్సరం క్రితమే పాలక మండళ్ల గడువు ముగిసింది. అప్పటి నుంచి స్పెషల్ ఆఫీసర్లే పరిపాలన చేస్తున్నారు. విలీనాన్ని అడ్డుకునేందుకు గానీ, ప్రశ్నించేందుకు గానీ సభ్యులు ఎవరూ ఉండరు. అందుకే సర్కారు ఈ సమయం చూసి ఈ నిర్ణయం తీసుకుంది.