సామగ్రి పంపిణీ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
WNP: జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వీపనగండ్ల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్ ఆదర్శ్ సురభి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా విధులు నిర్వహించాలని, త్వరగా పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని సిబ్బందికి ఆయన సూచించారు.