VIDEO: చలివేంద్రం ఏర్పాటు చేసిన ఎస్బీఐ యాజమాన్యం
NTR: తిరువూరు పట్టణంలోని State Bank of Indiaలో స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం ప్రారంభించారు. ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కస్టమర్లు, సాధారణ ప్రజల కోసం ఉచితంగా మజ్జిగ, మంచినీరు పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించడం ఆనందంగా ఉందని నిర్వాహకులు తెలిపారు. స్థానికులు ఈ సేవను ప్రశంసించారు.