సాంకేతిక సమస్య.. ఎయిర్‌పోర్ట్ ప్రకటన
ఢిల్లీ విమానాశ్రయంలో నిన్నటి నుంచి ATC వ్యవస్థ కుప్పకూలడంతో భారీగా విమానాలు రద్దు అయిన విషయం తెలిసిందే. అయితే ATC సాంకేతిక సమస్య కారణంగా తలెత్తిన అంతరాయం పూర్తిగా తొలగిపోయిందని ప్రకటించింది. విమానాశ్రయంలో ప్రస్తుతం అన్ని విమాన కార్యకలాపాలు సాధారణంగానే జరుగుతున్నాయని తెలిపింది. మరిన్ని వివరాల కోసం ఎయిర్‌లైన్స్ ను సంప్రదించాలని విమానాశ్రయం అధికారులు సూచించారు.