'మంచినీటిని నిలవ లేకుండా చూసుకోవాలి'

PPM: దోమల వల్ల పట్టణ ప్రాంతాలలో డెంగ్యూ జ్వరాలు ప్రబలుతాయని, మంచి నీరు ఇంటి పరిసర ప్రాంతాలలో నిల్వ లేకుండా చూసుకోవాలని జిల్లా మలేరియా అధికారి వై మణి అన్నారు. తమ పరిధిలో ప్రస్తుత మలేరియా డెంగ్యూ వ్యాధుల తీవ్రతను వైద్యాధికారి డాక్టర్ చాంద్‌ని అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు శుక్రవారం పార్వతీపురం పట్టణం జగన్నాధపురం పరిధిలో గల బొగ్గులవీధిని పరిశీలించారు.