VIDEO: అల్లూరులో సినిమా పాట షూటింగ్..

NLR: అల్లూరు పట్టణంలోని కోనేరు సెంటర్ వద్ద సోమవారం 'ఈమె సుబ్బమ్మ ఇదియే ఈమె కథ' అనే సినిమాకు సంబంధించిన పాటను చిత్రీకరణ చేశారు. గత పది రోజులుగా ఈ సినిమాను మండలంలోని పలు గ్రామాల్లో చిత్రీకరణ చేశారు. ఈరోజు సినిమాకి సంబంధించిన పాట షూటింగ్ జరగడంతో స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేశారు. కాసేపు ఈ ప్రాంతమంతా సందడి వాతావరణం నెలకొంది.