ప్రజలకు ములకలచెరువు ఎస్సై విజ్ఞప్తి

చిత్తూరు: ప్రజలు గొడవలకు దూరంగా ఉండాలని ములకలచెరువు ఎస్సై తిప్పేస్వామి, ఏఎస్ఐ నజీర్ కోరారు. శనివారం మండలంలోని సోంపాలెం, సోంపల్లి, బురకాయలకోట, వేపూరికోట, చౌడసముద్రం, అన్నగారిపల్లె గ్రామాల్లో పర్యటించారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలతో పార్టీల పేరుతో గొడవలు జరగకుండా, పికెటింగ్ ఏర్పాట్ల కోసం పాయింట్లు గుర్తించారు.