ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే

కోనసీమ: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం అని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అన్నారు. పట్టణంలో 19వ వార్డులో ఎమ్మెల్యే పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆనందరావు మాట్లాడుతూ.. ప్రతి నెలా ఒకటో తేదీ వేకువజామునే పింఛన్ల పంపిణీ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు, నేతలు పాల్గొన్నారు.