వైద్యుడి నిర్లక్ష్యంతో వ్యక్తి మృతి

వైద్యుడి నిర్లక్ష్యంతో వ్యక్తి మృతి

JGL: వైద్యుడి నిర్లక్ష్యంతో వ్యక్తి మృతి చెందాడని ఆరోపిస్తూ ఆసుపత్రి ముందు కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన పోతుగంటి శేఖర్ అనే వ్యక్తికి ఆయాసం వస్తుందని శనివారం మెట్ పల్లి పట్టణంలో శ్రీ ఆరోగ్య ఆసుపత్రిలో చేర్పించారు. సాయంత్రం వరకు చికిత్స అందించిన వైద్యుడు పరిస్థితి విషమంగా ఉండడంతో NZB ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు.