పాఠశాల కీర్తిని పెంచేలా సహకరించాలి: సర్పంచ్
SRPT: నడిగూడెం గురుకుల పాఠశాలలో బుధవారం తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సర్పంచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. పాఠశాల ఇంటర్లో 100 శాతం ఫలితాలు సాధించడం, జేఈఈ మెయిన్స్‌లో విద్యార్థులు ఎంపిక కావడం అభినందనీయమన్నారు. పాఠశాల కీర్తిని మరింత పెంచేలా తల్లిదండ్రులు సహకరించాలని, సెలవుల తర్వాత పిల్లలను సకాలంలో పాఠశాలకు పంపాలని కోరారు.