జగన్ నాటకం రక్తి కట్టలేదు: తిక్కా రెడ్డి
KRNL: హైదరాబాద్ సీబీఐ కోర్టు వద్ద మాజీ CM జగన్ ఆడిన నాటకం రక్తి కట్టలేదని జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి ఇవాళ అన్నారు. కోర్టుకు మందీ మార్బలాన్ని వెంటపెట్టుకుని వెళ్లడం ఏంటని ప్రశ్నించారు. జగన్‌కు పెళ్లికి, చావుకు తేడా తెలియడం లేదని ఎద్దేవా చేశారు. దివంగత రాజశేఖర్ రెడ్డి పేరును అడ్డం పెట్టుకుని జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు.