పర్యాటక ప్రియులకు శుభవార్త

పర్యాటక ప్రియులకు శుభవార్త

PLD: పర్యాటక ప్రియులకు పర్యాటక శాఖ శుభవార్త తెలిపింది. కొండవీడుకొండలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నైట్ టెంట్స్ క్యాంపెయిన్స్‌కు అనుమతులు వచ్చాయి. ఈ సేవలు రేపటి నుంచి అందుబాటులోకి రానున్నట్లు అధికారులు తెలిపారు. గత నెల 7, 8 తేదీల్లో 'కొండవీడు ఫెస్ట్' జరిగిన విషయం విదితమే. దీంతో ఇక్కడ రిసార్ట్స్ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు. ఇవి వస్తే ఈ ప్రాంతం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి.