ఐదుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు

TG: MLAల అనర్హత పిటిషన్లపై స్పీకర్ చర్యలు ప్రారంభించారు. వచ్చే వారం నుంచి విచారణ జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐదుగురు MLAలకు నోటీసులు జారీ చేశారు. ఈ ఐదుగురు ఎమ్మెల్యేల విచారణ పూర్తయ్యాక మరికొంతమందికి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఈ అంశంపై MLA బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి స్పందిస్తూ.. తనకు నోటీసులు అందాయని, చట్టాన్ని గౌరవిస్తానని పేర్కొన్నారు.