'మంచి ఆరోగ్యానికి సామాజిక పరిశుభ్రత అవసరం'
SKLM: మంచి ఆరోగ్యానికి వ్యక్తిగత, సామాజిక పరిశుభ్రత అవసరమని శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ కూర్మారావు అన్నారు. మంగళవారం రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రెడ్ క్రాస్ పరిపాలన భవనం నుంచి ఏడు రోడ్లు కూడలి వరకు ర్యాలీను ఆయన ప్రారంభించారు. జీవన శైలిలో మార్పు వలన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చన్నారు.