బండారుగూడెం గ్రామంలో 12 మంది వాలంటీర్లు రాజీనామా

బండారుగూడెం గ్రామంలో 12 మంది వాలంటీర్లు రాజీనామా

కృష్ణా: బాపులపాడు మండలం బండారుగూడెం గ్రామంలో 12 మంది వాలంటీర్లు గురువారం రాజీనామా చేశారు. ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టి, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంతో పాటు మళ్లీ జగన్మోహన్ సీఎం కావాలని సంకల్పంతో ఎన్నికల ప్రచారం చేసేందుకు తాము రాజీనామా చేసినట్లు వాలంటీర్లు తెలిపారు. ఎంపీడీవో రత్నకుమారికి రాజీనామా పత్రాలను అందజేశారు.