విద్యుత్ షాక్‌తో గృహిణి మృతి !

WGL: విద్యుత్ షాక్‌తో గృహిణి మృతి చెందిన సంఘటన పర్వతగిరి మండలం ధూపతండాలో ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. దారం సొత్తు విమల (35) వర్షం కురుస్తుండడంతో తన ఇంట్లో విద్యుత్ నిలిచిపోవడంతో విద్యుత్ స్తంభం వద్ద విద్యుత్ వైర్‌ను కదిలించడంతో విద్యుత్ షాక్‌కు గురైంది. దింతో వైద్యుల పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు.