సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
కృష్ణా: పెదపారుపూడి మండలంలోని పలు గ్రామాల లబ్ధిదారులకు రూ. 1,83,942 సీఎంఆర్ అఫ్ అలీ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ పథకంలో అవకాశం లేనివారికి వైద్యు ఖర్చుల నిమిత్తం సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.