నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

NLG: మిర్యాలగూడ 220-132-83 కేవీ సబ్ స్టేషన్ నుంచి త్రిపురారం(మం) మాటూర్ 33కేవీ పరిధిలో విద్యుత్ లైను మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ ఏఈ బాలునాయక్ తెలిపారు. గురువారం ఉదయం 7గంటల నుంచి 11గంటల వరకు మాటూర్ సబ్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాలకు కరెంట్ ఉండదని పేర్కొన్నారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించలన్నారు.