'చేయూత పెన్షన్లను వెంటనే పెంచాలి'

MBNR: వికలాంగులకు చేయూత పెన్షన్లను ప్రభుత్వం వెంటనే పెంచాలని ఎమ్మార్పీఎస్ జాతీయ అధికార ప్రతినిధి బుర్ర బిక్షపతి మాదిగ అన్నారు. శనివారం నవాబుపేట మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వికలాంగులకు 6000 పెన్షన్ వెంటనే ప్రభుత్వం పెంచి ఇవ్వాలన్నారు. ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ ఈ విషయమై అండగా ఉంటారన్నారు.