VIDEO: ముసారాంబాగ్ బ్రిడ్జి మూసివేత.. గోల్నాక నుంచి వెళ్లండి..!

HYD: మూసి ఉద్ధృతంగా ప్రవహిస్తున్న తరుణంలో ముసారాంబాగ్ బ్రిడ్జి మూసివేస్తున్నట్లు హైదరాబాద్ పోలీసులు ప్రకటించారు. వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్ గోల్నాక బ్రిడ్జి మీద నుంచి వెళ్లాలని సూచించారు. అంబర్‌పేట్ 6వ నెంబర్ సర్కిల్, ముసారాంబాగ్, మలక్‌పేట ప్రాంతాల నుంచి వచ్చే ట్రాఫిక్ గోల్నాక బ్రిడ్జి ఇరువైపులా వాహనాలను మరలిస్తున్నట్లు వివరించారు.