VIDEO: జిల్లాలో 'రణబాలి' షూటింగ్
ATP: జిల్లాలోని విడపనకల్, తాడిపత్రి పరిసర ప్రాంతాల్లో స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న 'రణబాలి' సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సందర్భంగా పల్లెటూరి నేపథ్యంతో కూడిన కీలక సన్నివేశాలను చిత్ర యూనిట్ ఇక్కడ చిత్రీకరిస్తోంది. తన అభిమాన హీరోను చూసేందుకు స్థానిక ప్రజలు, అభిమానులు షూటింగ్ స్పాట్‌కు భారీగా తరలివస్తున్నారు.