వింత ఆచారం.. వరుడికి చర్నకోలతో దెబ్బలు

AP: YSR కడప జిల్లాలోని బూచుపల్లె వంశీయుల పెళ్లిలో ఏళ్ల నుంచి వింత ఆచారం కొనసాగుతోంది. వివాహ తంతు అనంతరం వరుడికి చర్నకోలతో 3 దెబ్బలు కొడతారు. ఇది వందల ఏళ్ల నుంచి వస్తున్న సాంప్రదాయం. పూర్వం గంగమ్మ ఆలయం నుంచి ఓ పెట్టెను తెస్తే, అమ్మవారు స్వయంగా ఈ మేరకు ఆదేశించిన ఆచారంగా చెబుతున్నారు. తాళి కట్టగానే వరుడికి దెబ్బలు కొట్టడంతో పెళ్లి తంతు పూర్తవుతుందని వారంతా భావిస్తారు.