నువ్వాగుడలో సీసీ రోడ్డు నిర్మాణం ప్రారంభం

నువ్వాగుడలో సీసీ రోడ్డు నిర్మాణం ప్రారంభం

ASR: డుంబ్రిగూడ మండలం నువ్వాగుడలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను సర్పంచ్ సునీత గురువారం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. పంచాయతీలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఆమె తెలిపారు. ఇప్పటికే కంగారు సొల, గసభ గ్రామాల్లో సీసీ రోడ్లు పూర్తయ్యాయని చెప్పారు. త్రాగునీరు, విద్యుత్ దీపాలు వంటి ప్రాథమిక సదుపాయాల మెరుగుదలపై దృష్టి సారించినట్టు ఆమె పేర్కొన్నారు.