తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ

AP: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 83,380 మంది భక్తులు దర్శించుకోగా.. 27,936 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. కాగా.. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.35 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.