న్యుమోనియాతో మరణాలు ఉండొద్దు: కలెక్టర్
ELR: జిల్లాలో న్యుమోనియా వ్యాధి కారణంగా ఎటువంటి మరణాలు సంభవించకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. న్యుమోనియాను సమాజం నుంచి తరిమివేయాలన్నారు. దీనిపై సచివాలయాల పరిధిలో సర్వేలు, పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని ఆమె సూచించారు.