'సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి'

కృష్ణా: గుడివాడ ప్రభుత్వ వైద్యశాలలో 2020లో విధులు నిర్వహించిన సూపరింటెండెంట్‌తో పాటు మరో10మంది సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని మంత్రి సత్యకుమార్ మంగళవారం అధికారులను ఆదేశించారు. 2020లో జరిగిన పరిశీలనలో ఆసుపత్రి నిర్వహణ, ఆహారం, మందుల పంపిణీ, స్టాక్ రిజిస్టర్ల నిర్వహణలో తీవ్రమైన నిర్లక్ష్యంతో పాటు వాడకంలో లేని వాహన డ్రైవర్‌కు భారీ జీతం ఇచ్చిన అంశాలపై విచారణకు ఆదేశించారు.