చాపరాయిలో రోడ్డు ప్రమాదం

చాపరాయిలో రోడ్డు ప్రమాదం

ASR: డుంబ్రిగూడ మండలంలోని చాపరాయిలో బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. డుంబ్రిగూడకు చెందిన రామారావు చాపరాయిలో విధులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా ఆటో ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రామారావుకు గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే ఆయనను డుంబ్రిగూడ పీహెచ్సీకి తరలించి మెరుగైన చికిత్స నిమిత్తం అరకులోయ తరలించారు.