42 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ తొలి జాబితా
అసెంబ్లీ ఎన్నికల వేళ 42 మంది అభ్యర్థులతో అసోం కాంగ్రెస్ తొలి జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం జోర్హట్ నియోజకవర్గం నుంచి ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్ గొగొయ్ పోటీ చేయనున్నారు. అలాగే నజీరా స్థానం నుంచి రాష్ట్ర కాంగ్రెస్ ప్రతిపక్ష నేత దేబబ్రత బరిలో దిగనున్నారు. మొత్తం 126 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న రాష్ట్రంలో వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్నాయి.