VIDEO: కారంచేడు వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తి స్పాట్ డెడ్
BPT: వాడరేవు పిడుగురాళ్ల జాతీయ రహదారి కారంచేడు సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. తెలంగాణ నుంచి వాడరేవుకు వస్తున్న ఓ కారు టైరు పేలడంతో అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లిందని చెప్పారు. ఈ ఘటనలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.