రంగాపూర్ ఉర్సుకు పోటెత్తిన భక్తులు

NGKL: మత సామరస్యలకు ప్రతీకగా నిలిచే రంగాపూర్ నిరంజన్ శావలి ఉర్సు ఉత్సవాలకు సోమవారం నాడు భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులతో దర్గా ప్రాంతం సందడి నెలకొంది. దర్గా వద్ద భక్తులు మొక్కులు (కందుర్లు) చెల్లించుకుంటున్నారు. జాతరలో బొమ్మల దుకాణాల వద్ద ప్రజలు సందడి చేస్తున్నారు.