ప్రమాదవశాత్తు కాలువలో పడి బాలుడి మృతి
కృష్ణా: గూడూరు మండలం రాయవరంలో సోమవారం విషాద ఘటన జరిగింది. గ్రామానికి చెందిన ఉద్ధాంటి దేవహర్ష (16) కాలువలో స్నానానికి దిగి మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. దేవహర్ష తన మిత్రులతో కలిసి కాలువ వద్దకు వెళ్లి స్నానం చేస్తుండగా, అతని చెప్పు నీటిలో పడిపోయింది. దాన్ని తీసుకునేందుకు తిరిగి కాలువలోకి దిగగా ప్రమాదవశాత్తు అతడు మృతి చెందాడు. ఘటనపై మరిన్ని పూర్తి వివరాలు ఉంది.