VIDEO: ట్యాక్స్ చెల్లించని షాపులను సీజ్ చేసిన అధికారులు
నిజామాబాద్ నగరంలో పన్నులు చెల్లించని వ్యాపార సముదాయాలపై అధికారులు కొరడా ఝుళిపించారు. పలుమార్లు నోటీసులు జారీ చేసినా స్పందించకపోవడంతో షాపులను సీజ్ చేశారు. కోట్లాది రూపాయల మేర బకాయిలు ఉండటంతో మున్సిపల్ అధికారులు ఈ కఠిన చర్యలు చేపట్టారు. పన్నులు చెల్లించకుండా మొండికేసే వారిపై చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు.