కమీషనర్‌కి సమ్మె నోటీసు అందజేసిన కార్మికులు

కమీషనర్‌కి సమ్మె నోటీసు అందజేసిన కార్మికులు

ELR: జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ వెంకట రమణకి శుక్రవారం ఏఐటీయూసీ మండల కార్యదర్శి కుంచె వసంతరావు ఆధ్వర్యంలో సమ్మె నోటీసు అందచేశారు. కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలు విడనాడాలని కోరారు. 15వ తేదీన ఛలో విజయవాడ కార్యక్రమానికి ఇంజనీరింగ్ కార్మికులు హాజరుకావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు పాల్గొన్నారు.