29న విశాఖలో అమర్ రాజా గ్రూప్ మెగా జాబ్ మేళా

విశాఖ యువతీ యువకులకు గీతం విశ్వవిద్యాలయంలో ఈ నెల 29న అమర్ రాజా గ్రూప్ మెగా జాబ్ మేళా నిర్వహిస్తోంది. 10వ తరగతి/ఇంటర్/ఐటీఐ పాస్/ఫెయిల్ అయిన 18-35 ఏళ్ల వారు అర్హులు. శిక్షణ కాలంలో రూ12,500 - రూ15,000 స్టైపెండ్‌తో పాటు, శిక్షణ తర్వాత నెలకు రూ.22,000 వేతనం ఉంటుంది. భోజనం, వసతి సౌకర్యం కలదు. ఉదయం 9 గంటల నుండి గీతం క్యాంపస్‌లో ఉద్యోగ మేళా జరుగుతుంది.