దాని వల్లే బస్సు ప్రమాదం జరిగింది: క్లీనర్
ప్రకాశం: బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి ఆ బస్సు క్లీనర్ సంచలన విషయాలను వెల్లడించాడు. స్టీరింగ్ పట్టేయడం వల్లే ప్రమాదం జరిగిందన్నాడు. ప్రమాదానికి గంట ముందు కూడా సెన్సార్లు పనిచేయకపోవడంతో బస్సు ఆగిపోయిందన్నాడు. టిప్పర్‌ను తప్పించే క్రమంలో బస్సు కంట్రోల్ కాలేదన్నాడు. ఆ సమయంలో కూడా సెన్సార్లు పని చేయలేదని వివరించాడు. కాగా.. ఈ ఘటనలో ఇప్పటికే 14 మంది మృతిచెందారు.