నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన

నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన

ATP: గుంతకల్లు మున్సిపాలిటీలోని 35వ వార్డులో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను మంగళవారం మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి పరిశీలించారు. వార్డులో కలియ తిరుగుతూ వార్డు సమస్యల గురించి ప్రజలకు ఆరా తీశారు. వార్డులో ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా రోడ్డు నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు.