కర్ణాటక సీఎంను కాలమే నిర్ణయిస్తుంది: డీకే

కర్ణాటక సీఎంను కాలమే నిర్ణయిస్తుంది: డీకే

కర్ణాటకలో సీఎం మార్పు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ అంశంపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక సీఎంను కాలమే నిర్ణయిస్తుందని డీకే అన్నారు. సీఎం కుర్చీ కోసం ఎలాంటి తిరుగుబాటులు చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. నాయకత్వ మార్పుపై తాను ఎప్పుడు బహిరంగ ప్రకటనలు చేయలేదని పేర్కొన్నారు.