ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను పరిశీలించిన ఎంపీడీవో

SRD: కంగ్టి మండల రాసోల్ గ్రామంలో ఇందిరమ్మ పథకంలో మంజురై ఇంటి నిర్మాణాలు చేపడుతున్న లబ్ధిదారుల ఇంటి నిర్మాణాలను ఎంపీడీవో శ్రీనివాస్ మంగళవారం సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ .. గ్రామంలో ఇందిరమ్మ పథకంలో మంజురైన ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారు. తమతమ ఇండ్లను గడువు లోగా పూర్తి చేయాలని సూచించారు.