ఓయూ దూరవిద్యలో ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలు

HYD: ఓయూ దూరవిద్య కేంద్రంలో ఈ విద్యాసంవత్సరానికి MBA, MCA కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంట్రన్స్ పరీక్షలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొ.పాండురంగారెడ్డి తెలిపారు. వచ్చేనెల 7న జరిగే ప్రవేశ పరీక్షలకు 2వ తేదీ వరకు, రూ.500 అపరాధ రుసముతో 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.