నిరసన.. పోలీసులపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన ఉద్యోగి
పంజాబ్ చండీగఢ్‌లో జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. తమ డిమాండ్లే లక్ష్యంగా రోడ్ వేస్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. కొందరు బస్సులపైకి ఎక్కి నినాదాలు చేశారు. అయితే వారిని దింపేందుకు ప్రయత్నించిన పోలీసులపై ఓ ఉద్యోగి పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. వెంటనే అప్రమత్తమైన అధికారులు మంటలను అదుపు చేసి ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఉద్యోగిని అరెస్ట్ చేశారు.