నేడు నీటి సరఫరాలో అంతరాయం
NRML: కడెం, ఖానాపూర్, పెంబి, దస్తురాబాద్, మండలాలతో పాటు ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఇవాళ మిషన్ భగీరథ నీటి సరఫరాను నిలిపివేయనున్నట్లు EE మధుసూదన్ తెలిపారు. నీటి శుద్ధి కేంద్రానికి అత్యవసర మరమ్మతులు చేపట్టనున్న నేపథ్యంలో సాయంత్రం 6 గంటల వరకు నీటి సరఫరా నిలిపివేస్తున్నామన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు.