రేపు జిల్లాలో పీజీఆర్ఎస్ రద్దు: కలెక్టర్

W.G: జిల్లాలో అధిక వర్షాల నేపథ్యంలో సోమవారం జరగాల్సిన పీజీఆర్ఎస్ రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. అల్పపీడనం కారణంగా రానున్న మూడు రోజులపాటు అధిక వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను రద్దు చేయడం జరిగిందని ప్రకటించారు. జిల్లా, డివిజన్, మండల స్థాయిలో జరగాల్సిన పీజీఆర్ఎస్ జరగదన్నారు.