విషాదం.. గోదావరిలో మునిగి విద్యార్థి మృతి
కోనసీమ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బొబ్బర్లంక గోదావరిలో మునిగి ముగ్గురు విద్యార్థులు మృతిచెందారు. అందులో ఒకరి మృతదేహం లభ్యమవ్వగా.. మిగిలిన ఇద్దరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ముగ్గురు విద్యార్థులు రాజమండ్రిలోని జాంపేటకు చెందిన వారికి గుర్తించారు. కాగా.. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.