చెరువులో పడి ముగ్గురు విద్యార్థులు మృతి

చెరువులో పడి ముగ్గురు విద్యార్థులు మృతి

AP: కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిక్కవరంలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడి ముగ్గురు విద్యార్థులు మృతిచెందారు. నవీన్‌కుమార్‌(11), సాయి(16), వెంకటజోసఫ్‌(16)గా గుర్తించారు. హోలీ ఆడి, చేతులు కడుక్కునేందుకు చెరువు వద్దకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. నవీన్‌కుమార్‌, వెంకటజోసఫ్‌ మృతదేహాలు లభ్యం కాగా.. సాయి మృతదేహం కోసం గాలింపు కొనసాగుతోంది.